బుధవారం 27 జనవరి 2021
Nirmal - Nov 04, 2020 , 00:25:42

రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఖానాపూర్‌ : దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని, రైతులను మోసం చేసేలా చర్యలు తీసుకుంటున్నదని రైతు సం ఘాల నాయకులు ఆరోపించారు. ఖానాపూర్‌ పట్టణంలోని జేకే ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం జిల్లా రైతు సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య అధ్యక్షత వహించా రు. జాతీయ, రాష్ట్రస్థాయి రైతు సంఘాల నాయకులు పాల్గొన్నా రు. జిల్లా నలుమూలల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మా ట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కారు రైతులు పండించిన పం టలకు మద్దతు ధరలు ఇవ్వడం లేదన్నారు. రైతులు నిత్యం వాడుకొనే కరెంట్‌ మోటర్లకు మీటర్లు బిగింపజేసి వారికి తీవ్ర నష్టాన్ని కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ మార్కెటింగ్‌ విధా నాన్ని రద్దుచేస్తూ మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూ ర్చేలా ఉందన్నారు. పంటలను మద్దతు ధరల తో వారికి అందు బాటులో ఉన్న మార్కెట్లలో అమ్ముకునే వారని, అలా కాకుండా దేశంలో ఎక్కడికైనా వెళ్లి అమ్ము కోవచ్చని మోడీ ప్రభు త్వం చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు, చివరికి ఉల్లి ధరలు సైతం కేంద్రం గణనీయం గా పెంచి పేదలపై పెను భారం మోపిందన్నారు. రైతులకు, వ్యవసాయానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నా లుగు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 5న ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో రహ దారులను దిగ్బంధనం చేసి ఆందోళన చేపట్టాలని సభలో తీర్మా నించారు. ఏఐకేఎస్‌సీసీ జాతీయ కన్వీనర్‌ వెంకటరామయ్య, రాష్ట్ర కన్వీనర్‌ పల్లపు దేవేందర్‌రెడ్డి, ఆలిండియా కిసాన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ పద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శి ఎం శోభన్‌, జల్లా నాయకులు దుర్గం నూతన్‌కుమార్‌, ఎల్‌ భీమయ్య, సంగెపు బొర్రన్న, ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎల్‌ఆర్‌ ఉపాలి, భూక్యా సురేందర్‌, డాకూరి తిరుపతి, మడావి అంకుశ్‌రావు, హైమద్‌ఖాన్‌, నాగెళ్లి నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.logo