గిరిజనుల అభ్యున్నతికి కృషి..

- ఉపాధి కోసం అనేక పథకాలు..
- ఐటీడీఏ ఆధ్వర్యంలో కార్యక్రమాలు
- రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- పెట్రోల్ బంక్, గిరిజన భవన్, పల్లిపట్టి, సబ్బుల తయారీ పరిశ్రమలు ప్రారంభం
- ఏమాయికుంట జిన్నింగ్ మిల్లులో గిడ్డంగులు..
ఉట్నూర్ : గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అ న్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో సోమవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ రవాణా, డ్రైవర్ ఎంపవర్మెంట్, గిరి వికాసం, సీసీడీపీ ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు, సూపర్‌మార్కె ట్లు, పరిశ్రమలు నెలకొల్పుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలో సబ్బులు, తేనె పరిశ్రమను ప్రారంభించామని తెలిపారు. దీని ద్వారా సుమారు 40 మంది గిరిజన యువతకు ఉపాధి కల్పించామన్నారు. అలాగే ఉట్నూర్ కేంద్రంగా రూ.7కోట్ల 12 లక్షలతో యువతకు 104 వాహనాలను అందించనున్నట్లు చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీలో 500 జనాభాకు ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏజెన్సీలో విషజ్వరాలు రావడంతో గిరిజనులు చనిపోయేవారని పేర్కొన్నారు. అయితే ఉట్నూర్‌లో 100 పడకల దవాఖాన, నార్నూర్‌లో 50 పడకల దవాఖానలను అభివృద్ధి చేసి మెరుగైన వైద్యం అందిస్తునట్లు వెల్లడించారు. రైతుబంధు, రైతు బీమా ద్వారా గిరిజనులకు మేలు కలుగుతున్నదన్నారు. ఏజెన్సీలోని గిరిజనేతరులకు కూడా రైతుబంధు అందేలా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని, దీంతో రైతులకు ఇబ్బందులు కలుగకుండానే క్రయవిక్రయాలు, పట్టా మార్పిడి చేసుకోవచ్చని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం తగ్గినా పథకాల అమలు ఎక్కడా ఆగడంలేదన్నారు. అలాగే ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. మంత్రికి పలు సంఘాల నాయకులు, ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డా.క్రిస్టినా మాట్లాడుతూ.. గిరిజనులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతరం జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపురావు, ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ మాజీ ఏటీడబ్ల్యూ చైర్మన్ కనక లక్కేరావు, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, నాయకులు, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాలు..
ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.కోటి 20 లక్షలతో నిర్మించిన జీసీసీ పెట్రోల్ బంక్, శుభకార్యాలు, గిరిజన సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రూ.కోటి 10 లక్షలతో నిర్మించిన గిరిజన భవన్, పల్లిపట్టిల తయారీ పరిశ్రమను మంత్రి ప్రారంభించారు. బంక్‌ను ప్రారంభించిన సమయంలో స్వయంగా ప్రభుత్వ వాహనానికి పెట్రోల్ పోశారు. అలాగే గిరిజనులకు పంపిణీ చేసిన టెంట్‌హౌజ్ కుర్చీలో కూర్చొని, సరదాగా యువతను ఉత్తేజపరిచారు.
సబ్బుల పరిశ్రమ ప్రారంభం..
నిర్మల్ అర్బన్ : రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (టీఎస్జీసీసీ) ఆధ్వర్యంలో రూ.కోటి వ్యయంతో నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ పరిశ్రమను మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనతో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. గిరిజన సహకార సంస్థ ద్వారా ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తున్న్ల పేర్కొన్నారు. ఇందులో భాగంగా అటవీ ఉత్పత్తులను సేకరించడమే కాకుండా గిరిజనులతోనే ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహించి, మార్కెటింగ్ చేయించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో వచ్చే ఆదాయం వారికే చెందేలా చూస్తామన్నారు. గిరి తేనె, సహజసిద్ధమైన సబ్బులు, షాంపుల తయారీతో బహిరంగ మార్కెట్లో జీసీసీ తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో కలిసి గిరి తేనె ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు. తేనె సేకరణ, తయారీ విధానం, నాణ్యత పరిశీలన, అమ్మకాలు, మార్కెట్లో వాటి ధరలు తదితర విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో తయారవుతున్న తేనెను ప్రత్యేకంగా తాగి, నాణ్యతను పరిశీలించారు. మంత్రి వెంట నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇన్చార్జి డీఆర్వో రాథోడ్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్, నాయకులు ముత్యం రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శనిగారపు నరేశ్, శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ తదితరులున్నారు.
గిడ్డంగులు..
ఇంద్రవెల్లి : మండలంలోని ఏమాయికుంట సమీపంలో గల జిన్నింగ్ మిల్లులో ట్రైకార్ అందించిన రూ.60 లక్షలతో నిర్మించిన ఎఫ్‌పీవో గిడ్డంగులను సోమవారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటె శోభాబాయి, జట్పీటీసీ ఆర్క పుష్పలత, సర్పంచ్ జాదవ్ లఖన్సింగ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్