తుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యం

- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
మడ : రైతుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యంగా టీఆర్ఎస్ సర్కారు పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని న్యూసాంగ్వి గ్రామంలో ఆదివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఒకప్పుడు సాగుకు విద్యుత్ సమస్య ఉండేదని, కానీ టీఆర్ఎస్ సర్కారు 24 గంటలు సరఫరా చేస్తున్నదని తెలిపారు.
అలాగే రైతుబంధుతో పాటు రైతు బీమా అమలు చేసి, ఆదుకుంటున్నదన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎఫ్ఎస్సీఎస్ మాజీ అధ్యక్షుడు కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హరీశ్‌రావు, వైస్‌ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, మామడ సర్పంచ్ హన్మాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, డీఎస్వో కిరణ్, తహసీల్దార్ శ్రీకాంత్, నాయకులు సురేందర్‌రెడ్డి, నల్ల లింగారెడ్డి, చిన్నారెడ్డి, అశోక్, వికాస్‌రెడ్డి, జైసింగ్ పాల్గొన్నారు.
రైతుల కోసమే కొనుగోలు కేంద్రాలు..
ముథోల్ : రైతుల కోసమే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని మంత్రి అల్లోల అన్నారు. మండలంలోని బోరిగాంలో ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు నిరంతరం కృషిచేస్తున్నదన్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, నాయకులు బాశెట్టి రాజన్న, సురేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కనకరాజుకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
- ఆగని పెట్రో మంటలు
- ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభపెడితే రెండేళ్ల జైలు శిక్ష
- రవితేజ 'హల్వా డాన్స్' అదిరింది..వీడియో
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
- తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో