ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Nov 01, 2020 , 00:51:04

రామారావ్‌ మహరాజ్‌కు ఘన నివాళి

రామారావ్‌ మహరాజ్‌కు ఘన నివాళి

భైంసాటౌన్‌ / నిర్మల్‌ అర్బన్‌ / కుభీర్‌ / రెబ్బెన : బంజారాల ధర్మ గురువు రామారావ్‌ మహరాజ్‌కు భక్తులు శని వారం నివాళులర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి మౌనం పాటించారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని శ్రీ జగదాంబదేవి ఆల య ప్రాంగణంలో గల శ్రీ రామారావు మహారాజ్‌ ఆలయంలో లంబాడా కులస్తులు శ్రద్ధాంజలి ఘటించారు.  

మంత్రి అల్లోల సంతాపం

బంజారాల ఆరాధ్యదైవం సంత్‌శ్రీ తపస్వి పౌరా దేవి పీఠాధిపతి రామారావు మహరాజ్‌ మృతిపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. లంబాడా సమాజం అభ్యున్నతికి కృషి చేసిన రామారావు మహరాజ్‌ సేవలు మరువలేనివని అన్నారు. యావత్‌ భారత దేశంలోని బంజారాలను చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి రామారావు మహరాజ్‌ అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. సంత్‌ శ్రీ రామారావు మహరాజ్‌ ఆశయాలు, బోధనలను ఆచరిస్తూ ఆయన సూచించిన మార్గంలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఎన్నో సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి బంజారాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చిన ఆదర్శప్రాయుడు రామారావు మహరాజ్‌ అన్నారు. శ్రీరామారావు మహరాజ్‌ ముంబైలోని ప్రైవేట్‌ దవాఖానలో శ్వాసకోశ వ్యాధితో అనారోగ్యానికి గురై మృతి చెందారని పేర్కొన్నారు. మహరాజ్‌ స్వస్థలం మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లాలోని గలాపౌరగఢ్‌ ప్రాంతమని, ఆ ప్రాంతం బంజారుల పుణ్యక్షేత్రమని తెలిపారు.


logo