బుధవారం 02 డిసెంబర్ 2020
Nirmal - Oct 31, 2020 , 00:26:55

సదరం శిబిరం

సదరం శిబిరం

  • 80 మంది అర్హుల ఎంపికకు వైద్య పరీక్షలు

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపాలిటీలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం సదరం శిబిరం నిర్వహించారు. ఈ సారి శిబిరానికి కంటి చూపు సమస్య ఉన్నవారికి, దివ్యాంగుల కోసం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ శిబి రాన్ని పరిశీలించారు. అర్హులందరికీ న్యాయం చేయాలని  వైద్యులను కో రారు. ఖానాపూర్‌, కడెం, దస్తురాబాద్‌, పెంబి మండలాల నుంచి ప లువురు దివ్యాంగులు, కంటి సమస్యలున్నవారు శిబిరానికి తరలివచ్చారు. ఈ సారి జిల్లా ఉన్నతాధికారులు 50 మంది దివ్యాంగులు, 30 మంది కంటి చూపు సమస్యలున్నవారిని ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 150 మం ది శిబిరంలో పాల్గొనగా అందులో అర్హులను ఎంపిక చేస్తామని  నిర్మల్‌ ఏరియా దవాఖాన ఆర్‌ఎంవో డాక్ట ర్‌ వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్ట ర్‌ రవికుమార్‌ ఫిజీషియన్‌, శ్రీధర్‌ ఆర్థోపెడిక్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ వంశీమాధవ్‌, డాక్టర్‌ అరవిం ద్‌, రాకేశ్‌, ఆన్‌లైన్‌ ఇన్‌చార్జి ప్రదీప్‌, కం టి వైద్య సహాయకులు రాంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీ ల్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు. 

ఆర్‌ఎంవోకు సన్మానం

ఖానాపూర్‌ టౌన్‌: సదరం శిబి రం పర్యవేక్షణకు వచ్చిన జిల్లా ఏరి యా దవాఖాన ఆర్‌ఎంవో డాక్టర్‌ వే ణుగోపాలకృష్ణను మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ ఘనంగా సన్మానించారు. లాక్‌డౌన్‌ సమయంలో కొవిడ్‌-19 వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించి, ‘2020 కరోనా వారియర్‌ జాతీయ పురస్కారం’ అందుకున్న వేణుగోపాలకృష్ణ సేవలు మ రువబోమన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, ఖానాపూర్‌ ప్రభుత్వ దవఖాన సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ వంశీమాధవ్‌, వైద్యుడు అరవింద్‌, కొక్కుల ప్రదీప్‌ తదితరులు ఉన్నారు.