శనివారం 28 నవంబర్ 2020
Nirmal - Oct 30, 2020 , 00:38:52

ఖానాపూర్‌కు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌

ఖానాపూర్‌కు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌

  • త్వరలో ఏర్పాటు చేస్తాం
  • డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి
  • ఖానాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ
  • ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం

ఖానాపూర్‌ టౌన్‌: ఖానాపూర్‌ పట్టణంలో త్వరలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయనకు పోలీస్‌ సిబ్బంది గౌరవవందనం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ పరిధిలోని కేసుల వివరాలను ఎస్‌ఐ భవానీసేన్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో నేరాల అదుపునకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని ఆదేశించారు. పట్టణం మున్సిపాలిటీ గా మారడంతో  జన సాంద్రత పెరిగి ట్రాఫిక్‌ కు ఇబ్బందులు కలుగుతున్నట్లు పైఅధికారుల దృష్టికి వచ్చిందన్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పం పినట్లు వివరించారు. కొత్తగా ఎన్నికైన 50 మంది కానిస్టేబుళ్లను నిర్మల్‌ సబ్‌ యూనిట్‌కు  కేటాయించామ ని, త్వరలో విధుల్లో చేరుతారన్నారు. మండలంలో క్రైం కట్టడికి కృషి చేసిన ఎస్‌ఐని అభినందించారు. 2019లో 215 కేసులు నమోదవగా మొత్తం పరిష్కరించినట్లు వెల్లడించా రు. సీఐ శ్రీధర్‌గౌడ్‌, ఎస్‌ఐ భవానీసేన్‌ పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.