గురువారం 26 నవంబర్ 2020
Nirmal - Oct 29, 2020 , 01:31:27

నిర్మల్‌ పట్టణాభివృద్ధే ధ్యేయం

నిర్మల్‌ పట్టణాభివృద్ధే ధ్యేయం

  • మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
  • ఇప్పటికే కోట్లాది రూపాయలతో కొనసాగుతున్న పనులు..
  • ఆదర్శనగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ పట్టణ అభివృద్ధే ధ్యే యంగా ముందుకెళ్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌, మదీనా కాలనీలో బుధవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని 42వ వార్డులో సమస్యలను పరిష్కరించడంతో పాటు నిర్మల్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కోట్లా ది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనులన్నీ పూర్తయితే పట్ట ణం.. మెట్రో నగరాలను తలపించేలా తయారవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, రాంకిషన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సాజీద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ తదితరులున్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత..

పట్టణంలోని బుధవార్‌పేట్‌ కాలనీకి చెందిన పద్మకు మంజూరైన రూ.40 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కత్తి సుధాకర్‌, నితీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లి ఆలయ  నిర్మాణ పనులు ప్రారంభం..

సోన్‌ : నిర్మల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ పనులను మంత్రి అల్లోల భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి పునర్నిర్మాణ పనులు చేపడుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ అల్లోల రవీందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, అల్లోల సోదరులు మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, పాక్‌పట్ల సర్పంచ్‌ ఎల్‌చల్‌ గంగారెడ్డి, మాజీ సర్పంచ్‌ భీంరావు తదితరులు పాల్గొన్నారు. 

సమస్యలపై వినతి..

నిర్మల్‌ టౌన్‌ : టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు ప్ర భాకర్‌ ఆధ్వర్యంలో మంత్రి అల్లోలను ఆయన ని వాసంలో కలిశారు. పండుగ శుభాకాంక్షలు తెలి పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను ఆయనకు విన్నవించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ నాయకులు రవికుమార్‌, ధర్మానంద్‌ గౌడ్‌, బోనగిరి సుజయ్‌, జగదీశ్‌, జావిద్‌, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.