గురువారం 03 డిసెంబర్ 2020
Nirmal - Oct 29, 2020 , 01:31:27

కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి

కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి

  • అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి
  • అధికారులకు నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశం
  • మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వేర్వేరుగా సమావేశాలు

నిర్మల్‌ టౌన్‌ : ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం మా ర్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులతో మక్కల కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. 2020-21కి గాను ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి మక్కలను కొనుగోలు చేస్తున్నదన్నారు. ఇందుకు సం బంధించి ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల వారీగా అవసరమైన కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, మార్కెటింగ్‌ శాఖ అధికారి శ్రీనివాస్‌, పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్‌, డీఎం శ్రీకళ, ఏడీఏలు వినయ్‌బాబు, వీణ పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోళ్లపై కసరత్తు చేయాలి..

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి పంట కోతకు వస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. వరి సాగు విస్తీర్ణం ఆధారంగా ఆయా గ్రామాల్లో డీఆర్డీఏ, మార్కెటింగ్‌, డీసీఎంఎస్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద పంటకు సంబంధించిన పూర్తి వివరాలను వ్యవసాయ అధికారులు నమోదు చేసుకొని పంట మొత్తం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.