శుక్రవారం 27 నవంబర్ 2020
Nirmal - Oct 25, 2020 , 04:53:08

గంజాయి విక్రేతల అరెస్టు

గంజాయి విక్రేతల అరెస్టు

రామకృష్ణాపూర్‌ : పట్టణంలోని పోచమ్మ టెంపుల్‌ ప్రాం తంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పట్టణ ఎస్‌ఐ కటికె రవిప్రసాద్‌ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. శనివారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎడ్ల మహేశ్‌, ఎస్‌ఐ రవిప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లికి చెందిన గోపాల్‌రాయ్‌, కోట అభిలా ష్‌, తొంగల సాయితేజ గంజాయి అమ్ముతున్నారని సమాచారం అందింది. దీంతో వలపన్ని వారిని పట్టుకున్నాం. గో పాల్‌ కూలీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తాగుడు, వ్యసనాలకు బానిసై డబ్బులు సరిపోకపోవడంతో కోట అభిలాష్‌, తొంగల సాయితేజతో కలిసి గంజాయి అమ్ముతున్నాడు.  గోపాల్‌రాయ్‌పై గతంలోనూ ఈజ్‌గాంలో ఇదే విషయంమై కేసు నమోదయ్యింది. వీరినుంచి 3.5 కిలోల (గంజాయి విలువ సుమారు రూ 40 వేలు)  పట్టుకొని వారిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు వారు తెలిపారు.