శనివారం 23 జనవరి 2021
Nirmal - Oct 24, 2020 , 03:30:19

దుర్గామాతకు కుంకుమ పూజలు

దుర్గామాతకు కుంకుమ పూజలు

నిర్మల్‌ టౌన్‌ : పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంతో పాటు కళానగర్‌, భాగ్యనగర్‌, ఇందిరా నగర్‌, బాగులవాడ తదితర కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందిగుండం దుర్గామాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కళానగర్‌లో యజ్ఞం చేశారు.  భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకుడు వెంకటాచారి, భక్తులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌ /ఖానాపూర్‌ రూరల్‌: పట్టణంలోని దుర్గామాత మండపాల్లో మహిళలు శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా కాలనీల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో మండపాల  నిర్వాహకులతో పాటుగా ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. గోసంపల్లె దుర్గామాత మండపంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు తూం చరణ్‌, నిఖిత ఆధ్వర్యంలో కుంకుమ పూజ నిర్వహించారు. మస్కాపూర్‌లో భక్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో సత్తనపెల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ అమందశ్రీనివాస్‌,  పుప్పాల గజేందర్‌, సీతారాం గ్రామస్తులు ఉన్నారు. 

లక్ష్మణచాంద : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని తిర్‌పెల్లిలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల పండుగ  నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణారెడ్డి, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

దస్తురాబాద్‌ : మండల కేంద్రంలోని కొత్తగూడెం, మున్యాలలోని దుర్గామాత మండపాల్లో చండీయాగం నిర్వహించారు. జడ్పీటీసీ శారద, శ్రీనివాస్‌ దంపతులు,  నాగు స్వామి, పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. కార్యక్రమంలో పూజారులు వంశీ చార్యులు, నరేశ్‌ చార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, దుర్గామాత దీక్షా భక్తులు పాల్గొన్నారు.

కడెం : మండలంలోని ఎలగడప, సారంగాపూర్‌, మాసాయిపేట, లింగాపూర్‌లోని దుర్గామాత మండపాల్లో మహిళలు కుంకుమపూజలు నిర్వహించారు. అంతకుముందు మహిళలు బోనాలతో గ్రామంలో శోభాయాత్రగా మండపానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు ఆగునూరి సత్తమ్మ, మేకల రాజరెడ్డి, ఆకుల బాలవ్వ, మెలుగూరి రాముగౌడ్‌, నాయకులు గంగన్న, లచ్చన్న, వీడీసీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

లోకేశ్వరం : మండలంలోని అబ్దుల్లాపూర్‌లోని దుర్గామాత మండపంలో శుక్రవారం కుంకుమార్చన  నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమణారెడ్డి, ఎంపీటీసీ తోట ఇంద్ర, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. 

మామడ : మండలంలోని కమల్‌కోట్‌లో శ్రీరాజరాజేశ్వర వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. 

భైంసా/భైంసా టౌన్‌ : పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో అమ్మవారు  శుక్రవారం కాళికాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని కిసాన్‌గల్లి, నేతాజీనగర్‌, బట్టిగల్లి కాలనీల్లో మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని కుంసరలో దుర్గామాత మండపాల్లో  శుక్రవారం యజ్ఞం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రవీణ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 

కుభీర్‌: మండలంలోని పార్డి(కే) గ్రామంలో శుక్రవారం దుర్గామాత మండపంలో కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల గంగాధర్‌, విష్ణు, గంగాధర్‌, పూజారులు పాల్గొన్నారు.


logo