శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nirmal - Oct 22, 2020 , 00:48:44

కనుల పండువగా శరన్నవరాత్రోత్సవాలు

కనుల పండువగా శరన్నవరాత్రోత్సవాలు

దుర్గా దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉన్న బొజ్జావార్‌ ఆలయంలో  శ్రీ లలితా పంచమి, మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రీతి పాత్రమైన సామూహిక కుంకుమార్చనను బుధవారం నిర్వహించారు. నిర్మల్‌ పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భవానీ దీక్షాపరులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

-ఆదిలాబాద్‌ రూరల్‌/నిర్మల్‌ అర్బన్‌