శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nirmal - Oct 22, 2020 , 00:48:41

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రగతి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రగతి

  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

నిర్మల్‌ అర్బన్‌  : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్‌గాం చౌరస్తా వద్ద రూ.3 కోట్లతో చేపట్టిన  రోడ్డు పనులకు మంత్రి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈద్‌గాం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు పాడైన రహదారిని దీపావళి నాటికల్లా పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని కొనియాడారు. అన్నదాతల కోసం  రైతుబీ మా, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, కౌన్సిలర్లు సంపంగి రవి, నాయకులు ముడుసు సత్యనారాయణ, కో-ఆప్షన్‌ మెంబర్‌ సయ్యద్‌ మజర్‌, ఎన్‌హెచ్‌ పీడీ అరుణ్‌, పలు శాఖల అధికారులు  పాల్గొన్నారు.