బుధవారం 25 నవంబర్ 2020
Nirmal - Oct 21, 2020 , 09:14:34

రైతు వేదికలు సిద్ధం చేయండి

రైతు వేదికలు  సిద్ధం చేయండి

దస్తురాబాద్‌ : రైతు వేదికలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశించారు. దస్తురాబాద్‌ క్లస్టర్‌లో నిర్మిస్తున్న రైతు వేదికలను మంగళవారం ఆయన పరిశీలించారు. పనుల వివరాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలను దసరా రోజు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని,  నాణ్యత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బీ విశ్వంభర్‌, ఎంపీడీవో ఆర్ల గంగాధర్‌, డీఈఈ చందు, ఆర్‌ఐ గంగన్న, ఏఈవోలు తిరుపతి, పీఆర్‌ ఏఈ లవ కుమార్‌, ఏపీవో రవి ప్రసాద్‌, రాజనర్సయ్య పాల్గొన్నారు.

కడెం : జిల్లాలో చేపట్టిన రైతువేదికల నిర్మాణాలను దసరాలోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌  హేమంత్‌ బోర్కడే  ఆదేశించారు. కడెం మండలకేంద్రంలోని రైతువేదిక నిర్మాణాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ దసరాలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పనులు 80 శాతం పూర్తికాగా, విద్యుత్‌, ఇతర చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. పనులన్నీ ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.  కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఉపసంచాలకులు ఇబ్రహీం హనీఫ్‌, పంచాయతీరాజ్‌ ఏఈఈ లవకుమార్‌, జిల్లా కో-ఆప్షన్‌ రఫిక్‌ హైమద్‌, ఏఈవో సురేశ్‌, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.