టీఎస్ఆర్జేసీలో ప్రవేశానికి కౌన్సెలింగ్

నిర్మల్ అర్బన్ : టీఎస్ఆర్జేసీ నిర్మల్, బెల్లంపల్లి జూనియర్ కళాశాలల్లో బైపీసీ గ్రూపులో ప్రవేశాలకు జిల్లా కేంద్రంలోని శాంతినగర్ గురుకుల కళాశాలలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపాల్ నీరడి గంగాశంకర్ తెలిపారు. గురుకులాల సొసైటీ ఆదేశాల మేరకు మెరిట్, రిజర్వేషన్ 1:4 ఆధారంగా కొనసాగిందని పేర్కొన్నారు. రెండు జిల్లాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా, నిర్మల్లో 40 మంది బాలికలు, బెల్లంపల్లిలో 40 మంది బాలురకు సీట్లను భర్తీ చేశామని వెల్లడించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. కౌన్సెలింగ్ సభ్యులు నారాయణ, వెంకట్, కల్పన, రోహిణి, గణేశ్, సంతోష్, వీనారాణి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్లను ఆశ్రయించాలి
- రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: కలెక్టర్
- వాలీబాల్ C/O ఇనుగుర్తి
- సమస్యలు పరిష్కరిస్తా : జడ్పీ చైర్మన్
- అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
- సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- ‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’
- బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం