శనివారం 23 జనవరి 2021
Nirmal - Oct 21, 2020 , 09:12:58

సలహాలు అందించేందుకే వేదికలు

సలహాలు అందించేందుకే వేదికలు

బోథ్‌ : పంటల సాగులో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సాంకేతిక సలహాలు అందించేందుకే ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టిందని ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ జీ నగేశ్‌ పేర్కొ న్నారు. బోథ్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. పం టల సాగు, ఎరువుల వాడకం, మద్దతు ధరలు తెలుపడం, శిక్షణ వంటి కార్యక్రమాలను రాను న్న రోజుల్లో ప్రభుత్వం వేదికల ద్వారా అందించనున్నదన్నారు. వేదికను అందంగా నిర్మించిన ఎంపీపీ తుల శ్రీనివాస్‌ను అభినందించారు. అనంతరం రూ.19 కోట్లతో నిర్మిస్తున్న బోథ్‌-నిగిని రోడ్డును పరిశీలించారు. డబుల్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇరువైపులా భూములున్న రైతులు పనులకు సహకరించాలని కోరారు. నిర్మాణాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బోథ్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ కే ప్రశాంత్‌, మాజీ ఎంపీపీ కిషన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కే భోజా రాం, ఎం రాజేశ్వర్‌, జీ రాజేశ్వర్‌రెడ్డి, మేస్రం భూమన్న, గడ్డల రమణ, నారాయణ, గులాబ్‌సింగ్‌, మహిపాల్‌, అనిల్‌, ఎంపీటీసీ జుగదిరావు, సర్పంచ్‌లు విజయ్‌, శ్రీధర్‌రెడ్డి, సకారాం తదితరులు ఉన్నారు.


logo