సోన్‌లో భారీగా గుట్కా పట్టివేత

సోన్ : నిర్మల్ జిల్లాలో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. సోన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడ్తాల్ గ్రామ శివారు సాగర్ కన్వెన్షన్ హాలు వద్ద జాతీయ రహదారిపై సోమవారం రూ.19 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మహారాష్ట్రకు గుట్కాను తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో పోలీసు గస్తీని ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిపై సాగర్ కన్వెన్షన్ హాలు వద్ద సోన్ ఎస్ఐ ఆసిఫ్ ఆధ్వర్యంలో వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశామని తెలిపారు. ఓ ఐచర్ వాహనం అనుమానాస్పదంగా వస్తున్నట్లు గుర్తించామని, దాన్ని ఆపి తనిఖీ చేశామని పేర్కొన్నారు. అందులో వెనుక భాగంలో గుట్కా సంచులు కనిపించాయన్నారు. అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సరుకు విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి గుట్కాను తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఐచర్ వాహన డ్రైవర్ గౌస్ షరీఫ్, జాకీర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని తెలిపారు. నిషేధిత గుట్కా ను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున గుట్కా ను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ అక్రమార్కులు ఈ దందాను ఎంచుకోవడంపై పోలీస్‌శాఖ మరింత అప్రమత్తంగా ఉంటుందన్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గుట్కాను పట్టుకున్న ఎస్ఐ, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీఐ జీవన్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
- షాకయ్యే చరిత్ర 'ఆపిల్'ది
- రైతుల నిరసనను ఖండించిన మాయావతి
- బోల్తాపడ్డ డీసీఎం.. 70 గొర్రెలు మృతి
- కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న కమలా హ్యారిస్
- నేడు ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ
- 22 ఏళ్లు..18 సార్లు...