గురువారం 22 అక్టోబర్ 2020
Nirmal - Oct 18, 2020 , 02:22:04

ప్రయోగాత్మకంగా ‘ధరణి’ని ప్రారంభించాలి

ప్రయోగాత్మకంగా ‘ధరణి’ని ప్రారంభించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశం

నిర్మల్‌ టౌన్‌ : కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌ పనితీరును పరిశీలించేందుకు ప్రయోగాత్మకంగా ఆదివారం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి నిర్వహణపై హైదరాబాద్‌ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిర్మల్‌ కలెక్టరేట్‌ నుంచి కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, ఆర్డీవోలు రమేశ్‌ రాథోడ్‌, రాజు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఆదివారం నుంచి ప్రత్యేక లాగిన్‌లోకి వెళ్లి  డాక్యుమెంటేషన్‌ను డమ్మీ పద్ధతిలో పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయంలో 10 డాక్యుమెంట్లను పూర్తి చేసి లోపాలను గుర్తించాలన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని తెలిపారు. సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి ధరణి పోర్టల్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అందుకు అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


logo