జనసంద్రం... గంగనీళ్ల జాతర ప్రారంభం

గంగస్నానానికి పోచమ్మ నగలు
గ్రామగ్రామానా ఘన స్వాగతం
పోలీసుల భారీ బందోబస్తు
సారంగాపూర్/దిలావర్పూర్ : నిర్మల్ జిల్లాలోని శ్రీ మహా అడెల్లి దేవస్థానం గంగనీళ్ల జాతర శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అడెల్లి గ్రామంలో అమ్మవారు వెలిసిన ప్రదేశం నుంచి డప్పువాయిద్యాలతో అమ్మవారి నగలను ఆలయానికి భక్తుల మధ్య తీసుకెళ్లారు. ముందుగా అమ్మవారి నగలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయంలో అర్చకుడు శ్రీనివాస్‌శర్మ ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, ఈవో మహేశ్ తలమీద ఎత్తుకొని మోశారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి ఆభరణాలతో ఆలయం నుంచి అశేషభక్త జనంతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మండలంలోని అడెల్లి, సారంగాపూర్, యాకర్‌పల్లి, వంజర్, ప్యారమూర్ గ్రామాల మీదుగా దిలావర్పూర్ మండలంలోని మాడేగామ్, దిలావర్పూర్, బన్సపెల్లి, కంజర్, మల్లాపూర్ గ్రామాల మీదుగా సాంగ్వి గోదావరి తీరానికి చేరింది. అమ్మవారి నగల వెంట గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. పోచమ్మ గొప్పతనాన్ని కీర్తిస్తూ భక్తులు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. పోచమ్మ నగలకు ఆయా గ్రామాల్లో మహిళా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎస్ఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.
జాతరకు ఏర్పాట్లు పూర్తి..
నగలు తిరిగి అమ్మవారి చెంతకు చేరే క్రమంలో ఆదివారం పెద్దఎత్తున జాతర నిర్వహిస్తారు. దీనిని పురస్కరించుకొని భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో మహేశ్ తెలిపారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్, భక్తులకు తాగునీటి వసతి, వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. కొవిడ్ నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులు మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు. అమ్మవారి నగల వెంట రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సుచరిత, సుజాత, ఎంపీడీవో సరోజ, నాయకులు నాగయ్య, మధుకర్‌రెడ్డి, చందు, ప్రభాకర్‌రెడ్డి, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
- ప్రతి గ్రామంలో బస్‌షెల్టర్ : ఎమ్మెల్యే చిరుమర్తి
- సైకోను పట్టించిన సీసీ కెమెరా
- సూర్యాపేట చైతన్యాన్ని కాపాడుకుందాం
- వైద్య సిబ్బందికి మొదటి టీకా సంతోషకరం
- చిన్ని మెదడుకు పెద్ద కష్టం
- ‘540లో’ భూ వివాదాలు ఉత్తమ్ పుణ్యమే
- మంద మెరిసె.. మది మురిసె
- డే1సక్సెస్
- మన శాస్త్రవేత్తల కృషితోనే వ్యాక్సిన్ : గుత్తా