ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Oct 18, 2020 , 02:03:42

‘మక్క’ వద్దు..

‘మక్క’ వద్దు..

కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులకు తీవ్ర నష్టం

గత యాసంగిలో 13 లక్షల క్వింటాళ్ల కొనుగోలు

ఇప్పటికే 5.50 లక్షల క్వింటాళ్ల మేర నిల్వలు

క్వింటాలుకు రూ.1,760 మద్దతు ధర చెల్లింపు

బయట రూ.1000-1100 మించని వైనం

ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

నిర్మల్‌, నమస్తే తెలంగాణ/నిర్మల్‌ టౌన్‌ : కేంద్ర ప్రభుత్వ విధానాలతో మక్క రైతులకు సమస్యలు మొదలయ్యాయి. గత యాసంగిలో పండించిన మక్క నిల్వలే పుష్కలంగా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల మక్కల దిగుమతిపై సుంకాన్ని తగ్గించి అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లపాటు సరిపోయే మక్కలు ఉండగా.. కేంద్ర సర్కారు విధానాలతో మక్క పంటకు మద్దతు ధర చెల్లిం చే పరిస్థితి లేకుండా పోయింది. మక్కకు బహిరంగ మా ర్కెట్‌లో డిమాండ్‌ లేకపోయినా.. నష్టమని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,760 చొప్పున చెల్లించి కొనుగోలు చేసిం ది. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1,100 ఉండ గా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బంది లే కుండా కొనుగోళ్లు చేసింది. రవాణా, గోదాం నిల్వలు అన్ని కలిపి క్విం టాలుకు రూ.2,100 అయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో 13 లక్షల క్వింటాళ్ల మక్కలను కొనగా.. వీటిని గోదాంలు, స్కూళ్లు, ఫంక్షన్‌ హాళ్లలో నిల్వ చేశారు. నిర్మల్‌ జిల్లాలో 12.70 లక్షల క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 24 వేల క్విం టాళ్ల మక్కలను రూ.1,760 చొప్పున చెల్లించి రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మ క్కలకు మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు.

మక్క సాగుపై దిశానిర్దేశం

ఈ ఏడాది వానకాలంలోనూ మక్క సాగు చేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. దీంతో రైతులు మక్కలు సాగు చేయలేదు. పసుపులో అంతర పంటగా మాత్రమే వేశారు. తాజాగా యాసంగిలో కూడా మక్క సాగు చేయవద్దని.. ప్రత్యామ్నాయ పంట లే మేలని అధికారులు మక్కజొన్న సాగు నియంత్రణపై దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో మక్కసాగు చేస్తే కలిగే న ష్టాలపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈసారి యాసంగిలో మక్కసాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించేందుకు వ్యవసాయశాఖ అధికారు లు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నిర్మల్‌ జిల్లా లో యాసంగిలో  2.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని అంచనా వేశారు. గత యాసంగిలో 84,500 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి యాసంగిలో మక్కసాగు 5 వేల ఎకరాలకు మించకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మక్కకంటే ప్రత్యామ్నాయ పంటలు ఎంతో లాభదాయకమని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అట వీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మక్కను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రైతులను చైతన్యం చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు.  

మొదలైన యాసంగి సీజన్‌

అక్టోబర్‌లో యాసంగి సీజన్‌ ప్రారంభమైంది. ఇప్పటికే వానకాలంలో సాగైన మినుములు, సోయా పంట చేతికి రాగా.. ఆ భూముల్లో మక్కవేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మక్కవేస్తే మార్కెట్‌లో ధర ఉండదని, రెండేళ్ల కు సరిపోయే నిల్వలున్నాయని.. రైతులకు నష్టం వాటిల్లే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. బహిరంగ మార్కెట్‌లో  మక్కలకు ధర లేకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో క్వింటాలుకు రూ.1,760 మద్దతు ధర చెల్లిం చి కొనుగోలు చేసింది. కేంద్ర విధానాలతో బహిరంగ మార్కెట్‌లో మక్కలను క్వింటాలుకు రూ.1000-1100 వచ్చే పరిస్థితి లేదు. నిర్మల్‌ జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండ గా.. మక్క సాగుతో వచ్చే నష్టాలు, ప్రత్యామ్నాయ పంటలపై ఏఈవోల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో పుష్కలంగా భూగర్భ వనరులు పెరగడం, ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో.. సాగుకు ఢోకా లేకుండా పో యిం ది. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలపా టు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నది. ఈ నేపథ్యంలో మక్కల కంటే ఇతర పంటలు సాగు చేస్తేనే.. ప్ర యోజనం ఉంటుందని అధికారులు రైతులను చైతన్యం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలు మేలు

మక్క ఎకరం సాగు చేస్తే 25-30 క్వింటాళ్ల దిగుబడి వ స్తుంది. ఇతర పంటలు వేస్తే దానికంటే అధికంగా లాభాలను పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వేసవిలో వరి, జొన్న, రాగులు, వేరుశనగ, పొద్దు తిరుగుడు, చిరుధాన్యాల పంటలైన ఆవాలు, నువ్వులు లాంటి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. సోయా పంట సాగు చేస్తున్న రైతులు శనగ పంట వేసుకుంటే ఫిబ్రవరిలోపే పంట చేతికి వస్తుంది. ఆ త ర్వాత అదే భూమిలో మూడో పంట కింద వరి, జొన్న, కూరగాయలు, చిరుధాన్యాల పంటలు సాగు చేసుకోవచ్చని.. మూ డు పంటల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. మార్కెట్‌లో క్వింటాలుకు వరికి రూ.1,888(ఏ-గ్రేడ్‌ రకం), రూ.1,868(సాధారణ రకం), జొన్నలకు రూ. 2,640, రాగులకు రూ.3,295, వేరుశనగకు రూ.5,275, పొద్దుతిరుగుడు రూ.5,885, సజ్జలకు రూ.3,500, గోధుమలకు రూ.1,925 మద్దతు ధర లభిస్తున్నది. దీంతోపాటు ధనియాలు, ఆవాలు, కూరగాయ పంటలకు బహిరంగ మార్కెట్‌లో ధర బాగానే ఉంది. ఏవిధంగా చూసినా మక్కకు ప్రత్యామ్నాయంగా అనేక పంటలున్నాయని.. రైతులు మక్క వేయవద్దని వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలతోనే ప్రయోజనం 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యాసంగి సీజన్‌లో మక్కసాగును గణనీయంగా తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నాం. గత యాసంగిలో జిల్లాలో 84,500 ఎకరాల మక్క సాగు చేయగా.. ఈ సారి మక్కసాగును 5 వేల ఎకరాల్లోపు నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే మక్క సాగు వల్ల నష్టా లు, ప్రత్యామ్నాయ పంటల వల్ల కలిగే ప్రయోజనాలపై ఆయా వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో ఏఈవోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

-అంజిప్రసాద్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్‌