మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Oct 17, 2020 , 03:43:06

వేదికలను అందుబాటులోకి తేవాలి

వేదికలను అందుబాటులోకి తేవాలి

నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను వేగంగా పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని మండల స్థాయి అధికారులను నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం ఆయా మండలాల ఏఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు వేదికల నిర్మాణంపై సమీక్షించారు. జిల్లాలోని 79 క్లస్టర్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టగా, కేవలం 25 చోట్ల మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగతా చోట్ల 50 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు. 

పనుల పరిశీలన..

సోన్‌ : నిర్మల్‌, సోన్‌ మండలాల్లోని ఎల్లపెల్లి, కడ్తాల్‌ రైతు వేదికల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్‌, పంచాయతీరాజ్‌ డీఈ తుకారాం పాల్గొన్నారు.