ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Oct 16, 2020 , 02:15:33

కదిలి ఆలయంలో జడ్పీచైర్‌పర్సన్‌ పూజలు

కదిలి ఆలయంలో జడ్పీచైర్‌పర్సన్‌ పూజలు

దిలావర్‌పూర్‌ : కదిలి పాపహరేశ్వర ఆలయంలో గురువారం నిర్మల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, దిలావర్‌పూర్‌ ఎంపీపీ ఏలాల అమృత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు, అధికారులు చైర్‌పర్సన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని గర్భగుడి లో శివలింగానికి అభిషేకం నిర్వహించారు. మాత అన్నపూర్ణా దేవిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆల య పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. శాలువాతో సన్మానించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ముచ్చిండ్ల సరిత, ఆలయ ఈవో భూమ య్య, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, పీఆర్‌ ఏఈ శివకృష్ణ, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్‌ భుజంగ్‌రావు, కదిలి ఆలయ మాజీ చైర్మన్‌ సంబాజీ పటేల్‌, ఆనంద్‌రావు, రాజు, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు జీవన్‌రావు,  తదితరులు పాల్గొన్నారు.


logo