శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Oct 15, 2020 , 02:00:40

సమస్యలు పరిష్కరించాలని వినతి

సమస్యలు పరిష్కరించాలని వినతి

నిర్మల్‌ టౌన్‌ : రైతులు సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శికి  బుధవారం వినతి పత్రం ఇచ్చారు. పంటలకు మద్దతు ధర కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నూతన్‌ కుమార్‌, విలాస్‌, సత్యనారాయణ, రాం లక్ష్మణ్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.

భైంసా :  పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నాయకులు బుధవారం సందర్శించారు. ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రం తక్షణమే కనీస మద్దతు ధరల చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. వర్షానికి తడిసిన అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. అధిక వర్షంతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్వేచ్ఛ, వాణిజ్యం, నిత్యావసర సరుకుల సవరణ, కాంట్రాక్ట్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రేమ్‌నాథ్‌ రెడ్డి, రాంచందర్‌రెడ్డి, లక్ష్మణ్‌, గంగాధర్‌, ముత్తన్న పాల్గొన్నారు.   

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి 

తానూర్‌: మండలంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి వసంత్‌రావు అన్నారు. మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన వారు ఇళ్లల్లోనే ఉండాలని, వైద్యులు ఇచ్చిన మందులు వాడాలని సూచించారు. డాక్టర్‌ సుభాష్‌, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు  పాల్గొన్నారు. 

నిర్మల్‌లోనే మెరుగైన వైద్యసేవలు

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ పట్టణంలోనే మహానగరాలకు దీటుగా అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, వీటిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కావేరి దవాఖాన వైద్యుడు చక్రధారి అన్నారు. నిర్మల్‌ మండలానికి చెందిన సంతోషిమాత-మధుసూదన్‌ దంపతులకు మొదటి కాన్పులో నెలలు నిండకుండానే ముగ్గురు పిల్లలు జన్మించారు. గర్భం దాల్చినప్పటి నుంచి సంతోషిమాత ప్రతినెలా హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకునేది. ప్రసవానికి దాదాపు రూ.2 లక్షలు, పిల్లలు పుట్టిన తర్వాత ఐసీయూలో ఉంచడానికి రూ.7-8 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో నిర్మల్‌లోనే మెరుగైన వైద్య సదుపాయాలున్నాయని, నవజాత శిశువులను సంరక్షించేందుకు పూర్తి సౌకర్యాలు నిర్మల్‌లోని కావేరి ఆసుపత్రిలోనే ఉన్నాయని నిర్మల్‌కు రెఫర్‌ చేశారు. ఇద్దరు ఆడ, ఒక మగ బిడ్డ బరువు తక్కువగా ఉండడంతో వారం రోజులు ఎన్‌ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్యం అందించారు. వారు పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో బుధవారం డిశ్చార్జి చేసినట్లు వైద్యుడు చక్రధారి తెలిపారు. 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందించి పిల్లల ప్రాణాలు కాపాడిన వైద్యులను కుటుంబ సభ్యులు అభినందించారు.