శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Oct 15, 2020 , 02:00:54

కిటకిటలాడుతున్న వ్యాపార సముదాయాలు

కిటకిటలాడుతున్న వ్యాపార సముదాయాలు

 నిర్మల్‌ టౌన్‌ : జిల్లా కేంద్రంలో వ్యాపార దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మొన్నటి వరకు కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగాయి. అధిక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించుకునే దొండల సంప్రదాయంతో పాటు దసరా పండుగ సమీపించడంతో వ్యాపార దుకాణాలు కళకళలాడుతున్నాయి. అధిక మాసంలో ఆడబిడ్డలకు దొండలను ఇవ్వ ం ఆనవాయితీ. దీంతో దొండలకు ఉపయోగించే  సరుకులతో పాటు వస్త్ర, స్టీల్‌ దుకాణాలు, కిరాణా షాపులు కొనుగోళ్లతో కిక్కిరిపోతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వారం క్రితం నిర్మల్‌ డిపో పరిధిలో నిత్యం రూ.4లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం వచ్చింది. మూడు రోజులుగా రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు చేరుకుందని అధికారులు పేర్కొన్నా రు. దసరా సందర్భంగా దుస్తుల కొనుగోళ్లతో మార్కెట్లో సందడి కనిపిస్తున్నది.