ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Oct 10, 2020 , 01:45:09

పథకాలకు ఆకర్షితులై చేరికలు

పథకాలకు ఆకర్షితులై చేరికలు

కుభీర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తు న్న పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని మా ర్లగొండ, బ్రహ్మేశ్వర్‌ గ్రామాల్లోని బీఎస్పీకి చెం దిన వంద మంది నాయకులు, కార్యకర్తలు టీఆ ర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్‌, మాజీ జడ్పీటీసీ శంకర్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. దేగాంలోని త న నివాసంలో విఠల్‌రెడ్డి, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడే వారికి అధిష్టానం అండగా ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మార్లగొండ ఉపసర్పంచ్‌ జాదవ్‌ రాందాస్‌, తండా నాయక్‌ ప్రేమ్‌సింగ్‌, అవినాశ్‌తో పాటు 60 మంది అనుచరులు, బ్రహ్మేశ్వర్‌ కు చెందిన 30 మంది ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నీల అనిల్‌, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ రేకుల గంగాచరణ్‌, వైస్‌ ఎంపీపీ మోహియొద్దీన్‌, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు న్యాలపట్ల దత్తుగౌడ్‌, సర్పంచ్‌లు కదం దత్తూరాం పటేల్‌, దిగంబర్‌ పటేల్‌ పాల్గొన్నారు.