శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Oct 07, 2020 , 01:45:24

మహిళా సంఘాలను బలోపేతం చేయాలి

మహిళా సంఘాలను  బలోపేతం చేయాలి

నిర్మల్‌ టౌన్‌ : మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సంబంధిత అధికారులను గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు శోభారాణి, గోవింద్‌రావు, సాయికుమార్‌, రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2020-21 సంవత్సరానికి గాను మహిళా సంఘాలకు లక్ష్యం మేరకు బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలని సూచించారు. స్త్రీనిధి రుణాలను కూడా అందించాలని, కుటీర పరిశ్రమలను స్థాపించేందుకు ప్రోత్సహించాలని ఆదేశించారు. మహిళా పొదుపు సంఘాల సమావేశాలను ప్రతి నెలా నిర్వహించేలా చూడాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.