నిర్మాణ పనులు వేగవంతం చేయాలి...

తానూర్: రైతు వేదికల నిర్మాణ పనులు వేగవం తం చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. మండలంలోని దౌలతాబాద్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను ఆయన మంగళవా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు, ప్రకృతి వనాల నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలన్నారు. త్వరగా పూర్తి చేసేందుకు ఎక్కువ మంది కూలీలతో పని చేయించాలన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్‌సుందర్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు, వ్యవసాయ విస్తరణ అధికారి పవన్, ఆర్ఐ గంగాధర్, గ్రామస్తులు ఉన్నారు.
ముథోల్ : ముథోల్‌లోని రైతు వేదిక భవన నిర్మా ణ పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, గడువులోగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ రాజేందర్, ఏవో భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదిక భవన నిర్మాణ పనుల పరిశీలన
జైనథ్ : మండలంలోని నిరాల, దీపాయిగూడ, కూర గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. 11 క్లస్టర్లలో నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంత రం పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఆయన వెంట అధికారులు, నాయకులున్నారు.