ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Oct 07, 2020 , 01:36:23

గడువులోగా సర్వే పూర్తి చేయాలి

గడువులోగా సర్వే పూర్తి చేయాలి

కడెం : గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటా సర్వేను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గణేశ్‌ ఆదేశించారు. మండలంలోని ధర్మాజీపేట గ్రామాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వే వివరాలను పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో భాగంగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్‌ నెట్‌వర్క్‌ సరిగా లేని మారుమూల గ్రామాల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. నెట్‌ కోసం రూటర్‌ను వినియోగించి, డాటా ఎం ట్రీ, ఫొటో క్యాప్చర్‌, తదితర వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. గడువులో గా అన్ని గ్రామాల్లో సర్వేలు పూర్తి చేయాలని పం చాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్‌, సర్పంచ్‌ ఓర్సు వెంకటేశ్‌, పంచాయతీ కార్యదర్శి శాంత, పంచాయతీ సిబ్బంది, నాయకులు, తదితరులున్నారు. 

పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

జైనథ్‌ : ఎల్‌ఆర్‌ఎస్‌ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశించారు. మండలంలోని దీపాయిగూడ గ్రామంలో నిర్వహించిన సర్వేను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల కొలతలు సరిగ్గా తీయాలని సూచించారు. సేకరించిన వివరాలను నాన్‌ అగ్రికల్చర్‌ పోర్టల్‌ బుక్‌ అప్‌డేషన్‌ యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. ఆయన వెంట జడ్పీ సీఈవో కిషన్‌, ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో గజానన్‌రావు, ఎంపీవో వెంకటరాజు, ఏపీవో జగ్గేరావు , సర్పంచ్‌లు గంగన్న, ప్రభాకర్‌, వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ముజీబ్‌, తదితరులు ఉన్నారు. 


logo