శనివారం 23 జనవరి 2021
Nirmal - Oct 06, 2020 , 00:25:23

సర్వేకు ప్రజలు సహకరించాలి

సర్వేకు ప్రజలు సహకరించాలి

కుభీర్‌:  ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయేతర భూముల సర్వేకు ప్రజలు సహకరించాలని జడ్పీ సీఈవో సుధీర్‌బాబు కోరారు. కుభీర్‌లో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. దొంతుల శ్రీనివాస్‌ ఇంటి వివరాలను జడ్పీ సీఈవో స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వ్యవసాయేతర భూముల వివరాలను తప్పుల్లేకుండా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ పీ.మీర, పానాజీ విజయ్‌ కుమార్‌, ఎంపీడీవో శేఖర్‌, ఎంపీ వో గోవర్ధన్‌, ఈవో విక్రం, వైస్‌ ఎంపీపీ మోహియొద్దీన్‌, ఉప సర్పంచ్‌ ఇక్రమొద్దీన్‌, నాయకులు తూం రాజేశ్వర్‌, సంజయ్‌ చౌహాన్‌ ఉన్నారు. 

సోన్‌: నిర్మల్‌ మండలం ముఠాపూర్‌లో వ్యవసాయేతర భూముల సర్వేను ఎంపీడీవో సాయి రాం పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌, కార్యదర్శి ఉన్నారు. 

పెంబి:  మందపల్లి, పెంబితో పాటు పలు గ్రామాల్లో  నిర్వహిస్తున్న సర్వేను ఎంపీడీవో సాయన్న పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ వో చిక్యాల రత్నాకర్‌ రావు, సర్పంచ్‌లు సుధాకర్‌, పూర్ణచందర్‌ గౌడ్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

మామడ : మండలంలోని అన్ని పంచాయతీల్లో కార్యదర్శులు వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.  బురుగుపెల్లి,మొండిగుట్ట, కిషన్‌రావుపేట్‌లో ఎంపీవో ఖలీం సర్వేను పరిశీలించారు.  

దస్తురాబాద్‌ : మండలంలోని గొడిసేర్యాల, పెర్కపల్లెలో వ్యవసాయేతర ఆస్తుల సర్వేను ఎంపీడీవో ఆర్ల గంగాధర్‌ సోమవారం పరిశీలించారు. ఇండ్లు, భవనాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు, దేవాలయాలు, చర్చిల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తున్నారు. కార్యదర్శులు సౌమ్య, సుధాకర్‌ తదితరులు  పాల్గొన్నారు.

భైంసాటౌన్‌ : మండలంలోని వానల్‌పాడ్‌లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను ఎంపీడీవో గోపాల కృష్ణారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్పన జాదవ్‌, సర్పంచ్‌ మాంకుర్‌ రాజన్న, కార్యదర్శి పాండురంగ్‌, నాయకులు గణేశ్‌, రాంకుమార్‌ ఉన్నారు.


logo