టీఆర్ఎస్తోనే సామాజిక న్యాయం

- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- ఓడ్ కులస్తులకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ
- న్యూవెల్మల్‌లో పల్లె ప్రకృతి వనం ప్రారంభం
నిర్మల్ అర్బన్: రాష్ట్రంలో అట్టడుగు స్థాయి లో ఉన్న ప్రజలకు టీఆర్ఎస్తో సామాజిక న్యాయం చేకూరిందని మంత్రి అన్నారు. ప్ర భుత్వం బీసీ-ఏ జాబితాలో చేర్చిన ఓడ్ కులస్తుల మొదటి ధ్రువీకరణ పత్రాన్ని పవార్ నిహారికకు మంత్రి బుధవారం అందజేశారు. ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి ఫలాలు అందని అట్టడుగు స్థాయిలో ఉన్న కులస్తులను గు ర్తించి బీసీ-ఏ జాబితాలో చేర్చడం వలన నిజమైన సామాజిక న్యాయం అందుతుందని ఆయన అన్నారు. ఓడ్తోపాటు మరో 12 సం చార కులాలను బీసీ-ఏ జాబితాలో, మరో నాలుగింటిని బీసీ-డీ జాబితాలో చేర్చామన్నా రు. ప్రభుత్వం తమ గోడు విని ధ్రువీకరణ ప త్రాలు ఇవ్వడం ఆనందంగా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవార్ కైలాశ్ అన్నారు. అ నంతరం పలువురికి కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సంఘ సభ్యులు రామ్ కిషన్, సంతోష్, మాధవ్, సంజీవ్, తిరుపతి, విజయ్ తదితరులున్నారు.
నిర్మల్ టౌన్: పేదల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపుతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ ఫంక్షన్హాల్లో సారంగాపూర్, నిర్మల్ అర్బన్, రూరల్ పరిధిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. మొత్తం 128 లబ్ధిదారులకు కోటి రూ. 28 లక్షల విలువైన చెక్కులు అందించారు. అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ కింద 50 మందికి చెక్కు లు అందించారు. ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ సుభాష్ చందర్ పాల్గొన్నారు.
సోన్: ప్రతి పల్లెలో ప్రకృతి వనాల ఏర్పా టుతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని మంత్రి అన్నారు. మండలంలోని న్యూవెల్మల్‌లో పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ తదితరాలను పరిశీలించారు. అనంతరం రూ. 10లక్షలతో నిర్మించనున్న పోచమ్మ ఆలయానికి భూమిపూజ చేశారు. నిర్మల్ జిల్లాలో శా శ్వత విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం న్యూవెల్మల్‌లో 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తయిందని, అక్టోబరు 11న సంబంధిత శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రారంభిస్తారని చె ప్పారు. ప్రకృతివనంలో మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, ఎంపీపీ మానస, ఎంపీటీసీ నాగ య్య, సర్పంచ్ గంగామణి, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో ఉషారాణి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ నిర్మల్ మం డల కన్వీనర్ అల్లోల గోవర్ధన్‌రెడ్డి, ఎఫ్ఎసీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, ఎఫ్ఏసీఎస్ డైరెక్టర్లు తోట సాయన్న, దయాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వకిల్, మాజీ ఎంపీటీసీ రాం రెడ్డి, రఘుపతిరెడ్డి, నాయకులు సంగంపేట్ సర్పంచ్ విలాస్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్‌ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
- కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భారత్ టాప్
- దీప్‌సింగ్ సహా పలువురికి ఎన్ఐఏ సమన్లు: రైతు నేతల ఫైర్
- శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే
- యాడ్ జింగిల్స్ సాంగ్.. వావ్! ఎంత బాగుందో..
- 'నా వ్యాఖ్యలు నొప్పిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం'