శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Sep 29, 2020 , 02:11:37

భూ సమస్యలు తీర్చేందుకే కొత్త రెవెన్యూ చట్టం

భూ సమస్యలు తీర్చేందుకే కొత్త రెవెన్యూ చట్టం

  • n నిర్మల్‌ జడ్పీ అధ్యక్షురాలు విజయలక్ష్మి
  • n నృసింహస్వామి ఆలయంలో పూజలు

దిలావర్‌పూర్‌ : రైతులకు భూ సమస్యలు లేకుండా చేసేందుకే సీఎం కేసీఆర్‌  కొత్త రెవెన్యూ చట్టానికి రూప కల్పన చేశారని నిర్మల్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కే విజయలక్ష్మి అన్నారు. మండలంలోని కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని విజయలక్ష్మి దంపతులు సోమవారం దర్శించుకోగా అర్చకులు, ఈవో వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వారిని సన్మానించారు. అనంతరం ఆలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు మాట్లాడారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతుకు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారని తెలిపారు.  దసరా రోజు ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రానున్నదని చెప్పారు.    నిర్మల్‌ రైతు సహకార సం ఘం మాజీ చైర్మన్‌ రాం కిషన్‌రెడ్డి, ఆలయ ఈవో సదయ్య, అధికారులున్నారు.