గురువారం 21 జనవరి 2021
Nirmal - Sep 27, 2020 , 02:13:21

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

  • అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే    n  2కే రన్‌ ప్రారంభం

నిర్మల్‌ టౌన్‌ : ఆరోగ్యమైన జీవితానికి వ్యాయామంతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడల యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, డీఈవో ప్రణీత, జిల్లా క్రీడల అధికారి ముత్తన్న, ఒలంపియన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య, పీఈటీలు భోజన్న, తదితరులు పాల్గొన్నారు. logo