ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Sep 26, 2020 , 02:06:32

నేడు కృతజ్ఞతా ర్యాలీ

నేడు కృతజ్ఞతా ర్యాలీ

నిర్మల్‌ అర్బన్‌/ కుభీర్‌/ లక్ష్మణచాంద: కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా నిర్మల్‌ నియోజకవర్గంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కనాకాపూర్‌ నుంచి లక్ష్మణచాంద మండల కేంద్రం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఇం దులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొననున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ర్యాలీ ని విజయవంతం చేయాలని  ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. లక్ష్మణచాందలో డీసీసీబీ వైస్‌ చైర్మ న్‌ రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ సాతం గంగారం, నాయకులు కృష్ణారెడ్డి, అడ్వాల రమేశ్‌ పిలుపునివ్వగా, కుభీర్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్‌, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ రేకుల గంగాచరణ్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు దత్తూగౌడ్‌, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు పుప్పాల పీరాజీ పిలుపునిచ్చారు.