బుధవారం 21 అక్టోబర్ 2020
Nirmal - Sep 26, 2020 , 02:06:33

సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయాలి

సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయాలి

  • n నిర్మల్‌ కలెక్టర్‌  ముషారఫ్‌ అలీ ఫారూఖీ
  • n అధికారులకు ఆదేశం
  • n రైతు వేదిక నిర్మాణాల పరిశీలన

నిర్మల్‌ టౌన్‌: యాసంగి (2019-20)కి సంబంధించి సీఎంఆర్‌ (కస్టం మిల్టెడ్‌ రైస్‌) సరఫరా లక్ష్యాలను వెంటనే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సీఎంఆర్‌ సరఫరాపై జిల్లా ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. 2019-20కి సంబంధించిన సీఎంఆర్‌ బియ్యం నెలాఖరులోగా  సేకరించాలని ఆదేశించారు. తర్వాత వానకా లం సీజన్‌లో వచ్చే ధాన్యం రైస్‌ మిల్లులకు తరలించాల్సి ఉంటుందని అప్పటి వరకు మిల్లు ల్లో ఉన్న నిల్వలను సేకరించాలని సూచించా రు. జిల్లాలో తొమ్మిది రైస్‌మిల్లుల్లో బియ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఆర్వో రమేశ్‌ రా థోడ్‌, ఆర్డీవో రాజు, పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్‌, డీఎం శ్రీకళ, తహసీల్దార్లు సుభాష్‌ చందర్‌, ప్రభాకర్‌, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

పల్లె ప్రగతి పనులను పూర్తి చేయాలి

పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహిస్తున్న అన్ని రకాల పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు, ఇంకుడుగుంతల నిర్మాణం, ఊరికో ఉద్యానవనం, హ రితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, పల్లె ల్లో శుభ్రత, తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. గ్రామాల్లో రైతుల కోసం నిర్మిస్తున్న రైతు వేదికలతోపాటు కల్లాల ప్లాట్‌ఫారం లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నా రు. డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు. 

రైతు వేదికల పరిశీలన

పెంబి/ లక్ష్మణచాంద: రైతు వేదిక భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. పెంబి మండలంతో పాటు ఇటిక్యాల గ్రామం, లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్‌(డ బ్ల్యూ), బోరిగాం, పొట్లపెల్లిలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన పనులను పరిశీలించారు. పెంబి లో పనులు నత్తనడకన సాగుతుండడంతో పం చాయతీరాజ్‌ ఏఈని మందలించారు. మండలంలో క్రిమిటోరియం పనుల వివరాలను జడ్పీ సీఈవో సుధీర్‌బాబును అడిగి తెలుసు కున్నారు. పెంబిలో ఎంపీడీవో సాయన్న, ఎం పీవో చిక్యాల రత్నాకర్‌రావ్‌, తహసీల్దార్‌ రాజ్‌మోహన్‌, ఎంఏవో వినోద్‌, ఏఈవో గంగాజళ, పంచాయతీరాజ్‌ ఏఈ విజయ్‌, టీఆర్‌ఎస్‌ పెంబి మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్‌, రైతు బంధు సమితి కన్వీనర్‌ భూక్యా గోవింద్‌, వైస్‌ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి తదితరులు పా ల్గొన్నారు. లక్ష్మణచాంద, బోరిగాం సర్పంచ్‌ లు సురకంటి ముత్యంరెడ్డి, మాదస్తు లక్ష్మి, ఏపీవో దివ్య, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, తహసీల్దార్‌ సత్యనారాయణరావు, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, ఎంపీడీవో మోహన్‌ తదితరులున్నారు.


logo