శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Sep 25, 2020 , 02:28:18

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

  •  ముథోల్‌ ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి 
  • నిగ్వా, కుప్టి గ్రామాల్లో పలు పనులకు శంకుస్థాపన

కుభీర్‌ :  గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని  కుప్టి, నిగ్వా గ్రామాల్లో పంచాయతీ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు స్థానిక సర్పంచ్‌లు గాడేకర్‌ గంగాబాయి, రమేశ్‌తో కలిసి గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కుప్టి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. వైకుంఠధా మం, ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, రైతువేదికల పనులు దసరాలోగా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీ కృష్ణ మందిర్‌లో  ప్రత్యేక పూజలు చేశారు. ఉప సర్పంచ్‌ ఉల్చ సాయినాథ్‌, రా ష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ రేకుల గంగాచరణ్‌, వైస్‌ ఎం పీపీ మొహియొద్దీన్‌, దత్తహరి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు దత్తుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి తూము రాజేశ్వర్‌, నాయకులు సంజయ్‌ చౌహాన్‌, పుప్పాల పీరాజీ, మల్లారెడ్డి, సంతోష్‌, చిన్నూ, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.