ఉమ్మడి జిల్లాకు ఆరు అంబులెన్స్‌లు

- n ‘గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా అందించిన ప్రజాప్రతినిధులు
- n మంత్రి అల్లోల మూడు, విప్ రెండు, ఎమ్మెల్యే ఒకటి అందజేత
- n హైదరాబాద్ ప్రగతి భవన్లో జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నిర్మల్ అర్బన్/ చెన్నూర్ టౌన్/ మంచిర్యాల టౌన్: “గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరు అంబులెన్స్ లు సమకూరాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు అందజేసిన కొవిడ్-19 రెస్పాన్స్ అంబులెన్స్‌లను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రగతి భవన్లో జెండా ఊపి ప్రా రంభించారు. మం త్రి అల్లోల సొంత ఖర్చు రూ.61.50 లక్షలతో మూడు అంబులెన్స్‌లు సమకూర్చారు. ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ 2, మంచిర్యాల ఎ మ్మెల్యే దివాకర్ రావు ఒక అంబులెన్స్ అం దజేశారు. వీటిని కొవిడ్-19 సహాయక చర్యలకు అందజేశారు. మంత్రి, ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్ హృదయ పూర్వకంగా అభినందించారు. మంత్రి, విప్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కరోనా బాధితుల కోసం అంబులెన్స్‌లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు చెప్పారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల్లో అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్‌తో పాటు అత్యాధునిక సదుపాయాలు ఇం దులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ విప్బా ల్క సుమన్, మం చిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, టీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు అల్లోల గౌ తం రెడ్డి, నడిపెల్లి విజిత్ రావు ఉన్నారు.
తాజావార్తలు
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..