వేదికలను వేగవంతం చేయాలి

- n పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు భూములు గుర్తించాలి
- n వీధి వ్యాపారులకు రుణాలు మంజూరుచేయాలి
- n వీసీలో సీఎస్ సోమేశ్ కుమార్
ఎదులాపురం/ నిర్మల్ టౌన్ : రైతు వేదికల ని ర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. సచివాలయం నుంచి బుధవారం కలెక్టర్లు, అదన పు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీ వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ.. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు భూములను గుర్తించి గ్రౌండింగ్ చేయాలన్నారు. పల్లె ప్రగతి పనులను వేగవంతం చేసి, స కాలంలో పూర్తిచేయాలని సూచించారు. వీధి వ్యా పారులకు గుర్తింపు కార్డులు అందజేసి, రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి, వచ్చే ఏడాదికి అవసరమైన మొక్కలను పెంచాలని సూ చించారు. లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ నిర్వహించాలన్నారు. ఆక్రమణ భూములను గుర్తించాలని సూచించారు. ప్రజలు ఎల్ఆర్ఎస్ను వినియోగించుకునేలా ప్రచారం చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్లు, జిల్లా, డివిజనల్ పంచాయతీ, మండల పరిషత్ అధికారులు.. నిత్యం గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. అక్టోబర్ 10వ తేదీ నాటికి రైతువేదికల నిర్మాణాలు పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వ నాల ఏర్పాటుకు 24వ తేదీలోగా పంచాయతీ ని ధుల నుంచి పది శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని సూచించారు. వీధి వ్యాపారుల దరఖాస్తులను అప్లోడ్ చేసి, రుణాల మంజూరుకు బ్యాం కర్లను సమన్వయం చేసుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అదన పు కలెక్టర్లు జీ సంధ్యారాణి, ఎం డేవిడ్, హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవోలు కిషన్, సుధీర్‌కుమార్, డీఆర్డీవోలు రాజేశ్వర్ రాథోడ్, వెంకటేశ్వర్లు, డీపీవోలు శ్రీనివాస్, వెంకటేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, పంచాయతీ రాజ్ ఈఈ రాజ్‌కిషన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- అలాగైతే ప్రజాస్వామ్యానికి తీరనిముప్పు: బాంబే హైకోర్టు సంచలనం
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ