ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Sep 23, 2020 , 01:56:51

ప్రగతి పనుల్లో వేగం పెంచాలి

ప్రగతి పనుల్లో వేగం పెంచాలి

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ
  • అధికారులతో సమీక్ష

నిర్మల్‌ టౌన్‌ : జిల్లాలో పల్లె ప్రగతి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం పల్లె ప్రగతి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన శ్మశానవాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, హరితవనాలు, ఇంకుడుగుంతల ఏర్పాటు వంటి పనులపై ఆరా తీశారు. అలాగే రైతు వేదికల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత ఉండేలా పంచాయతీ సిబ్బందిని ప్రోత్సహించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లను కూడా చేపట్టాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.