బుధవారం 28 అక్టోబర్ 2020
Nirmal - Sep 22, 2020 , 02:15:29

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు అభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు అభివృద్ధి

  • n జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌
  • n  సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ   కార్యదర్శులతో    సమావేశం

గుడిహత్నూర్‌: ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు అభివృద్ధి  చెందుతాయని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పారిశుద్ధ్యం, హరితహారం నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించారని పేర్కొన్నారు. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టంతో సర్పంచ్‌ల బాధ్యతలు పెరిగాయని గుర్తు చేశారు. నిధులు, పనులు, అభివృద్ధి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవరించే సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కొత్త చట్టం ప్రకారం పంచాయతీ సమావేశాలు నిర్ణీత సమయంలో నిర్వహించుకోవాలన్నారు. ఏటా డిసెంబర్‌లో ఆడిట్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు తమ వంతు బాధ్యత తీసుకోవాలని డీపీవో సూచించారు.  సమావేశంలో ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్‌, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సత్యానందస్వామి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు జీ తిరుమల్‌గౌడ్‌, సర్పంచ్‌లు కుమ్రం సంభు, జాదవ్‌ గోవింద్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.    

  మోడల్‌ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి

సిరికొండ: ప్రజలు, అధికారుల సహకారంతో తమ గ్రామ పంచాయతీలను మోడల్‌గా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ సర్పంచ్‌, కార్యదర్శులకు సూచించారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం వారితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి దుకాణానికి లైసెన్స్‌ అందించాలని, ఈ  నెల 30 లోగా వందశాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను నిత్యం కార్యదర్శులు పరిశీలించాలని ఆదేశించారు. సర్పంచ్‌లు గ్రామాల్లోని అధికారుల సమయపాలన, విధులను పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం సర్పంచ్‌లు, కార్యదర్శులు డీపీవో శ్రీనివాస్‌కు శాలువా కప్పి సన్మానించారు. ఎంపీడీవో సురేశ్‌, ఎంపీవో అతుల్‌ కుమార్‌, ఏపీవో సుభాషిణి, టీఏలు మోహన్‌ సింగ్‌, సుభాష్‌ పాల్గొన్నారు.logo