గురువారం 21 జనవరి 2021
Nirmal - Sep 22, 2020 , 02:15:31

బాపూజీ ఆశయ సాధనకు కృషిచేయాలి

బాపూజీ ఆశయ సాధనకు కృషిచేయాలి

  • ఉద్యమాలే ఊపిరిగా  తన జీవితం సమాజానికి అంకితం..
  • రాష్ట్ర మంత్రి  అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
  • కొండా లక్ష్మణ్‌ బాపూజీ 8వ వర్ధంతి 
  • విగ్రహానికి పూలమాలలు,  ఘన నివాళి..

నిర్మల్‌ అర్బన్‌ : బడుగు బలహీన వర్గాల అ భ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష్మణ్‌ బాపూజీ 8వ వర్ధంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి మంత్రి అల్లోల పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జన్మించి, రాజకీయంగా, సామాజికంగా ఎత్తుపల్లాలను చవిచూసిన బాపూజీ.. ఉద్యమాలే ఊపిరిగా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారని కొనియాడారు. ఆయన విలక్షణ జీవన శైలి ప్రతి ఒక్కరికీ అనుసరణీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన ఆశయ సాధన కోసం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగం గా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజి రాజేందర్‌, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు బిట్లింగ్‌ నవీన్‌, గండ్రత్‌ రమణ, శ్రీకాంత్‌, నేరెళ్ల వేణు, నాయకులు కోటగిరి అశోక్‌, మేడారం ప్రదీప్‌, అడ్ప పోశెట్టి, పద్మశాలీ సంఘం సభ్యులు రమణ, దత్తాద్రి, కుర్ర నరేశ్‌, యువజన సంఘం అధ్యక్షుడు మాడ వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.logo