సోమవారం 26 అక్టోబర్ 2020
Nirmal - Sep 21, 2020 , 00:59:18

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

బాసర : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నా రు. బాసర నుంచి ఓని వెళ్లే మార్గంలోని దాతలు అందించిన భూమిలో ఆదివారం పీఏసీఎస్‌ గోదాముల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నా రు. ఇందులో భాగంగా పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మిస్తున్నదని తెలిపారు. పీఏసీఎస్‌ గోదాములో విత్తనాలు, ఎరువులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. గోదాముల కోసం భూమి ని విరాళంగా అందించిన బల్గూరి నర్సింగ్‌రావు, బల్గూరి గంగారాయుడు, బల్గూరి సంతోష్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం రవీంద్రపూర్‌ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లలోకి వరదనీరు చేరి ఇబ్బందులుపడ్డ బాధితులను స్వయంగా వెళ్లి పరామర్శించారు. ప్రభు త్వం పరంగా సాయం అందేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, నాయకులు రమేశ్‌, వైస్‌ ఎంపీపీ నర్సింగ్‌రావు, సుధాకర్‌రెడ్డి, మల్లయ్య యాదవ్‌, శ్యాం, పోతన్న, బల్గం దేవేందర్‌, మాణిక్‌పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. 

అమ్మవారి సన్నిధిలో పూజలు..

బాసర సరస్వతీ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ముందుగా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూ జలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారి ప్ర సాదాన్ని అందజేశారు. అనంతరం అతిథి గృహా ల నిర్మాణ పనుల గురించి ఆలయ ఈవో వినోద్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. logo