సాగునీటికి ఢోకా ఉండదు

- నిండుకుండలా ఎస్సారెస్పీ
- రెండు పంటలకు నీళ్లు..
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సందర్శన
- గోదావరికి ప్రత్యేక పూజలు
- నిర్మల్‌లో మత్స్యభవనం నిర్మాణ పనుల పరిశీలన
సోన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని, రైతులు రెండు పంటలు పండించేందుకు సాగునీటికి ఢోకా లే దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీని ఆదివారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. నాలుగు రోజులుగా గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్న విష యం తెలిసిందే. కాగా, ప్రాజెక్టుపై నుంచి వెళ్లిన మంత్రి, నీటి విడుదల దృశ్యాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం ఆనందంగా ఉందన్నారు. దీంతో ఆయకట్టు రైతులకు ఏ ఇబ్బందీ ఉండబోదని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా నీటి విడుదలకు కూడా ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద గోదావరికి పూజలు చేశారు. ఇప్పటి వరకు భారీగా వరదనీరు వచ్చి చేరిందని అధికారులు మంత్రికి వివరించారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, అదే స్థాయిలో నిల్వ ఉంచి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి అల్లోల వెంట సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ నిర్మల్ మండల మాజీ కన్వీనర్ ముత్యంరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌గౌడ్, ఈఈ రామా రావు తదితరులు ఉన్నారు.
మత్స్యభవనం పరిశీలన..
నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ కాలనీలో రూ.కోటితో నిర్మిస్తున్న మత్స్యభవనం పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదన్నారు. ఇందులో భాగం గా వారికి సబ్సిడీపై వాహనాలు అందజేస్తున్నదని పేర్కొన్నారు. అలాగే చెరువుల్లో చేపపిల్లలను కూడా విడుదల చేస్తున్నదని వెల్లడించారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, క్లాస్‌వన్ కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, యువరాజ్ తదితరులున్నారు.
జాతీయ జెండా ఆవిష్కరణ..
నిర్మల్ పట్టణంలోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మార్చాల్సి వస్తుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కూడా జెండాను మార్చినట్లు గు ర్తుచేశారు. అనంతరం ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి