సోమవారం 18 జనవరి 2021
Nirmal - Sep 20, 2020 , 03:02:11

మంత్రి అల్లోల పరామర్శ

మంత్రి అల్లోల పరామర్శ

తలమడుగు: మండలంలోని ఉమ్రి సర్పంచ్‌ పెందూర్‌ లక్ష్మణ్‌ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శనివారం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మణ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మణ్‌ మృ తి పార్టీకి, గిరిజనులకు తీరనిలోటు అని అ న్నారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్‌ జ నార్దన్‌ రాథోడ్‌, డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంబ్లే, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, సహకార బ్యాంక్‌ జిల్లా డైరెక్టర్‌ బాలురి గోవర్ధన్‌ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్‌ ముడుపు దామోదర్‌ రెడ్డి, రైతుబంధు సమి తి మండల అధ్యక్షుడు ముడుపు కేదారేశ్వర్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పిడుగు సంజీవ్‌ రెడ్డి, కా టిపల్లి వసంత్‌ రెడ్డి, తోట వెంకటేశ్‌, కిరణ్‌, అబ్దుల్లా, సదాశివ్‌ యాదవ్‌ ఉన్నారు.