బుధవారం 27 జనవరి 2021
Nirmal - Sep 20, 2020 , 03:02:13

మెరుగైన వైద్యసేవలు అందించాలి

మెరుగైన వైద్యసేవలు అందించాలి

  • n  సమయపాలన పాటించాలి
  • n  కరోనా టెస్టులు పెంచాలి
  • n  నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ
  • n  వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం

నిర్మల్‌ టౌన్‌ : రోగులకు  మెరుగైన వైద్యసేవలు అందించాలని నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ పథకాలపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు దవాఖానల్లో ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తున్నాదన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించి రోగు లు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, నర్సాపూర్‌ దవాఖానలతో పాటు పీహెచ్‌సీల్లో కూడా ప్రతినెలా ప్రసవాలు చేయాలని, వెంటనే కేసీఆర్‌ కిట్‌ అందించాలని సూచించారు. నెలవారీ టీకాల కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని, అంటు రోగాలు రాకుండా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ర్యాపిడ్‌ టె స్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ ఆన్‌లైన్‌ లొకేషన్‌ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వసంత్‌రావు, వైద్యాధికారులు దేవేందర్‌రెడ్డి, కార్తీక్‌, రజిని, కాశీనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

టెండర్ల పరిశీలన 

వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగులకు వివిధ సేవలు అందించేందుకు టెండర్లు నిర్వహించగా  ఆయన పరిశీలించారు. దవాఖానల్లో ఆహారంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు, ఇతర నిర్వహణ టెండర్లను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. 

అటవీ ప్రాంతంలో కలెక్టర్‌ మార్నింగ్‌ వాక్‌

పెంబి: మండలంలోని అటవీ ప్రాంతంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ శనివారం మార్నింగ్‌ వాక్‌చేశారు. ముందుగా నిర్మల్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మందపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి వేణునగర్‌ వరకు 10 కిలోమీటర్లు నడకతో పాటు పరిగెత్తారు. కలెక్టర్‌కు పలువురు గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ పలకరించారు. ఆయన వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.logo