‘ప్రగతి’ పనులు వేగంగా చేపట్టాలి

- n గడువులోగా పూర్తిచేయాలి
- n నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- n జిల్లా అధికారులు, సర్పంచ్‌లతో సమీక్ష
- n జోహార్‌పూర్, జౌలా, చించోలి, చుచుల్లో పనులపై అసంతృప్తి
నిర్మల్ టౌన్ : పల్లె ప్రగతి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు, సర్పంచ్‌లతో పల్లె ప్రగతి పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్మశానవాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికల నిర్మాణం, హరితహారం మొక్కల సంరక్షణ, హరితవనాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడ్డ గ్రామాలను గుర్తించి, పనులను ముందుకు నడిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని జోహార్‌పూర్, జౌలా, చించోలి, చుచుల్ తదితర గ్రామాల్లో పనులు నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, పంచాయతీ ఈఈ సుదర్శన్‌రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వెల్డన్ విహారి: మంత్రి కేటీఆర్
- రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు దూరం
- భాయ్నేతో మౌత్ డాల్దీ!
- ‘కొవిడ్' టీకాపై అపొహలు వీడాలి
- పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోవాలి
- అధికారుల గైర్హాజరుపై సభ్యుల ఆగ్రహం
- మంత్రి కొప్పులను కలిసిన నాయకులు
- విజేత పాలమూరు
- రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి : ఎర్రబెల్లి
- టీకాపై ఆందోళన వద్దు