మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nirmal - Sep 16, 2020 , 03:10:22

పోషణ్‌ మాసోత్సవం నిర్వహించాలి

పోషణ్‌ మాసోత్సవం నిర్వహించాలి

  ఇచ్చోడ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఉమారాణి  n  అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ  n  రికార్డుల పరిశీలన

ఇచ్చోడ : అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్‌ మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఐసీడీఎస్‌ ఇచ్చోడ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ పూస ఉమారాణి అన్నారు. మండల కేంద్రంలోని నాలుగో అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లు లబ్ధిదారులకు పోషణ్‌ మాసోత్సవంపై గృహ సందర్శన చేస్తూ, అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. 3-6 ఏళ్లలోపు గల పిల్లలను నెలనెలా బరువు చూసి  రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. 

పోషకాహారం తీసుకోవాలి

తలమడుగు: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవాలని మండల ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి అన్నారు. కజ్జర్లలో రెండో అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడూతూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌ వెంకటమ్మ, ఉప సర్పంచ్‌ ప్రశాంత్‌, అంగన్‌వాడీ టీచర్‌ శోభ,  తదితరులు పాల్గొన్నారు.


logo