రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి

- n పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షించాలి
- n హరితహారం పకడ్బందీగా చేపట్టాలి
- n నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- n వివిధ శాఖల అధికారులతో సమీక్ష
నిర్మల్ టౌన్: జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలో సమీక్ష నిర్వహించారు. మండల, గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికలలో చిట్యాల గ్రా మంలో ఇటీవలే పూర్తయిందని, మిగతా నిర్మాణాల పురోగతిని నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇసుక, సిమెంట్, రాడ్ ఇతర సామగ్రిని అందుబాటులో ఉం చుకోవాలన్నారు, రైతు వేదికల ప్రాంగణంలో ఆహ్లాదకర వా తావరణం కన్పించేలా విభిన్న ఆకృతులకు ప్రాధాన్యతనిస్తూ పచ్చదనం పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఏడీలు, ఏవోలు, ఏఈవోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కస్తూర్బా పాఠశాలలు, కళాశాలల్లో భోజన మెనూకు సంబంధించి కూరగాయలు, గుడ్లు, మటన్, చికెన్, ఇతరత్రా వస్తువుల సరఫరాకు నిర్వహించిన టెండరు ఖరారు ప్రక్రియ లో విద్యాశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
హరితహారం పకడ్బందీగా చేపట్టాలి
హరితహారంలో భాగంగా ప్రతి శాఖ వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో హరితహారం, పల్లె ప్రకృతివనాల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలుపై సోమవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. గ్రామీణ, ప ట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేలా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, శ్మశానవాటికలు, డంప్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతినవాలు, రోడ్లకు ఇరువైపులా అటవీ, ప్రభుత్వ ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రల్లె ప్రకృతి వనాల ప నులు వేగవంతం చేయాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లును ఆదేశించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు ఎస్పీ రాంరెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేశ్, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజీప్రసాద్, పీఆర్ ఈఈ సుదర్శన్‌రావు, జిల్లా వైద్యాధికారి వసంత్‌రావు, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి రమేశ్‌కుమార్, తదితరులున్నారు.
తాజావార్తలు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
- నదిలో పడవ మునిగి నలుగురు మృతి
- యూకే వైరస్‌పై సమర్థంగా పని చేస్తున్న కొవాగ్జిన్