శనివారం 24 అక్టోబర్ 2020
Nirmal - Sep 12, 2020 , 03:10:12

కొత్త రెవెన్యూ చట్టం చారిత్రాత్మకం

కొత్త రెవెన్యూ చట్టం  చారిత్రాత్మకం

  •  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  మనోహర్‌
  • n  సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం

బేల :  తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు చారిత్రాత్మకమని ఆదిలాబాద్‌ జిల్లా గంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌ అన్నారు. మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సమస్యలు తీర్చడంతో పాటు వీఆర్‌ఏలకు పేస్కేల్‌ అమలు చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, అడనేశ్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సతీశ్‌ పవార్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ఠాక్రే, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు జక్కుల మధూకర్‌, నాయకులు మంగేష్‌ ఠాక్రే, సంతోష్‌ బెదుల్కర్‌, కోడే బిపిన్‌, ప్రశాంత్‌ గుండావార్‌, సునీల్‌, సుధాంరెడ్డి  పాల్గొన్నారు. 

నార్నూర్‌ : మండల కేంద్రంలోని గాంధీచౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో పటాకులు  కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ ఆడె సురేశ్‌, డైరెక్టర్‌ కాంతారావ్‌ దుర్గే, టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, స్థానిక సర్పంచ్‌ బానోత్‌ గజానంద్‌నాయక్‌,  టౌన్‌ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్‌, షెడ్యూల్డ్‌ కులాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌దుర్గే, జిల్లా అధ్యక్షుడు భగవాన్‌ కాంబ్లే, మాజీ ఉపసర్పంచ్‌ షేక్‌ దాదే అలీ, టీఆర్‌ఎస్‌ నాయకులు హైహద్‌, షేక్‌ హుస్సేన్‌, గణేశ్‌, అనిల్‌, మూసా తదితరులున్నారు.

నాగల్‌కొండలో..

నాగల్‌కొండలో సర్పంచ్‌ జాదవ్‌ సునీత ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్తులు ఉన్నారు.

ఉట్నూర్‌: ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగారె భరత్‌, రైతు బంధు స మితి మండలాధ్యక్షుడు అహ్మద్‌ అజీమొద్దీన్‌, పీఏసీఎస్‌ చైర్మ న్‌ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌, సెడ్మాకి సీతారాం, కామెరి పోశన్న, ధరణి రాజేశ్‌, రాజ్‌కుమార్‌  పాల్గొన్నారు.

జైనథ్‌: మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం వీఆర్‌ఏలు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం నాయకుడు మడావి సంతోష్‌,  వీఆర్‌ఏలు అడెళ్లు రమణ, నందు, జనార్దన్‌ పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ రూరల్‌:  మావల మండల కేంద్రంలో నాయకులు, రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్లా రాజేశ్వర్‌  పటా కులు కాల్చారు. పార్టీ మండలాధ్యక్షుడు గంగుల కిరణ్‌, ఉమాకాంత్‌ రెడ్డి, మావల ఉపసర్పంచ్‌ మహేందర్‌ యాదవ్‌, సుధీర్‌, నిజనాపూరి విజయ్‌, గంగయ్య, అజీజ్‌  పాల్గొన్నారు.

తలమడుగు: మండల కేంద్రంలో వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు నరేందర్‌ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వీఆర్‌ఏలు మర్రి రవి, కిష్టు, కుమ్మరి లింగన్న, అశోక్‌, రఫీక్‌, తిరుపతి, రూప, మంజుల ఉన్నారు. 

ఉట్నూర్‌ రూరల్‌: మండలంలోని దంతన్‌పెల్లిలో, సాలేవాడ(కే)లో టీఆర్‌ఎస్‌ నాయకులు, మండల అధ్యక్షుడు సింగారే భరత్‌ నాయకులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పీఏసీఎస్‌  చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి , సర్పంచ్‌ భూమన్న, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్‌, నాయకులు దాసండ్ల ప్రభాకర్‌, కామెరి పోశన్న, సెడ్మాకి సీతారాం, మునీర్‌, రైతులు పాల్గొన్నారు.   

తలమడుగు: వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు నరేందర్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వీఆర్‌ఏలు మర్రి రవి, కిష్టు, కుమ్మరి లింగన్న, అశోక్‌, రఫీక్‌, తిరుపతి, రూప, మంజుల ఉన్నారు. 


logo