గురువారం 28 జనవరి 2021
Nirmal - Sep 11, 2020 , 03:04:59

కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతడు

కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతడు

  • n వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి పీడ వదిలించిండు..
  • n కొత్త రెవెన్యూ చట్టం-2020 మన మంచికే..
  • n పల్లెల్లోని హోటళ్లు, కూడళ్లు, చేల వద్ద ఒకటే చర్చ
  • n సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి రైతుల బ్రహ్మరథం

వీఆర్వోల వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ లో ప్రవేశపెట్టడంపై పల్లెల్లో జోరుగా చర్చసాగుతున్నది. హోటళ్లు, కూడళ్లు, చేలు, నలుగురు రైతులు గుమిగూడితే బిల్లు గురించే మా ట్లాడుకుంటున్నారు. వీఆర్వోల పీడ విరగడైందని, ఇదంతా తమ మంచికేనని చర్చించుకుంటున్నారు. బిల్లు లోని నూతన విధానాలు, మార్పులు-చేర్పులు, ధరణి, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పట్టాదారు పా సుపుస్తకాలు వంటి అంశాలపై ప్రధానంగా మాట్లాడుకుంటు న్నారు. చరిత్రాత్మక బిల్లు ప్రవేశపెట్టడంపై సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతు న్నారు. చరిత్రలో నిలిచిపోతడని పేర్కొంటున్నారు. 

కుభీర్‌లో ‘చాయ్‌ పే చర్చా..’

అది నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలంలోని పాత బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ చాయ్‌ హోటల్‌. గు  రువారం ఉదయం 7.24 గంటలు అవుతున్నది. రైతులు బొయిడి దత్తు, ఖమర్‌, ప్యాట రాములు నడుచుకుంటూ హోటల్‌కు వచ్చారు. అప్పటికే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వచ్చి ఉండడంతో రైతులు తలో పేజీ తీసుకుని చదివారు. ఇంతలోనే గోరేకర్‌ పాపన్న, దీపాయి బాబు, మ్యాకల గంగాధర్‌లు వచ్చారు. ఇంతలోనే హోటల్‌ యజమాని పీరాజి చాయ్‌ తీసుకురావడతో అందరూ తాగారు. పత్రికలో వచ్చిన వార్తలు చూసి రాములు సీఎం కేసీఆర్‌ మంచి పని చేస్తున్నడే అన్నడు. ఏం మంచిపనే అని దత్తు అన గానే.. ఏందే గిదువర్రాక ఏం సదువుతున్నవే. రైతులను అరిగోస పుచ్చుకుంటున్న వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిండు. నిన్ననే(బుధవారం) అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు కూడా ప్రవేశపెట్టాడటా. ఇగ మన గోస తీరినట్టేనే అన్నడు. ఇంతలోనే మ్యాకల గంగాధర్‌ కల్పిం చుకొని నా భూ మికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడానికి తిప్పంచుకున్నడు. గిది సదివినా రే అని బాబు అన్నడు. ఏందే అని ఖమర్‌ అనగా మన తహసీల్దార్‌ కార్యాలయంలో ఒకే రోజు భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పట్టాదారు పాసుపుస్తకం ఇస్తరటా అన్నడు. సీఎం ఎంత మంచి పని చేస్తున్నడని, గిటువంటి కేసీఆరే మళ్లీ సీఎం కావాలంటూ.. అందరూ రైతులు హోటల్‌ యజమానికి డబ్బులు చెల్లించి ఇండ్లలోకి వెళ్లారు.   


logo