శనివారం 16 జనవరి 2021
Nirmal - Sep 10, 2020 , 03:40:02

ఎస్టీపీపీలో వీరజవాన్ల పేరిట రోడ్డు మార్గం

ఎస్టీపీపీలో వీరజవాన్ల పేరిట రోడ్డు మార్గం

జైపూర్‌: జైపూర్‌ సింగరేణి విద్యుత్‌ కేంద్రంలో సీఐఎస్‌ఎఫ్‌ యూనిట్‌ ప్రదేశంలో రోడ్డు మార్గాన్ని బుధవారం ప్రారంభించారు. 1997లో జవాన్లు ఆర్‌జీ రాం, షాహిద్‌ హర్బన్‌ బన్వర్‌లాల్‌, వీక్‌ రామన్‌ శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఇందారంఖని -1ఏ గనిపై సికాస దాడిలో వీర మరణం పొందారు.  మినిస్ట్రీ ఆఫ్‌ హోం ఎఫైర్స్‌ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు వీరజవాన్ల పేరిట జైపూర్‌ విద్యుత్‌ కేంద్రం లో రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈడీ సంజయ్‌కుమార్‌ సూర్‌, జీఎం జేవీపీ శాస్త్రి, చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ జేఎన్‌ సింగ్‌, సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ రాకేశ్‌ కుమార్‌, కే కార్తికేయన్‌, డిప్యూటీ కమాండెంట్‌ రాకేశ్‌ కుమార్‌, ట్రెయినీ ఐపీఎస్‌ అధికారి అశోక్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాజ్‌పౌల్‌ పాల్గొన్నారు.