‘తుంతుంగా’ సమస్యను ప్రస్తావించిన విప్

- శాసన సభలో చర్చించిన సుమన్
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండ లం ఎదుల్లబంధం గ్రామ సమీపంలోని తుంతుం గా చెరువు మత్తడి నీటి ప్రవాహంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శాసన సభలో ప్రస్తావించారు. తుంతుంగా చెరువు మత్తడి ప్రవాహం పెరిగితే ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, జనగామ, ఆలుగామ, సూపాక, వెంచపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే ప్రవాహం అవతల వైపు ఉన్న వారు ఇవతలికి రా లేకపోతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. తా ను కూడా స్వయంగా వెళ్లి నీటి ప్రవాహాన్ని చూ సి అక్కడి ప్రజలతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అలాగే చెన్నూర్-భీమారం మండలాల మధ్యన గల జోడువాగు వద్ద రోడ్డు ధ్వంసమైందని, వేమనపల్లి మండలం నీల్వాయి-గొర్లపల్లి మధ్యన ని ర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో చెన్నూర్-బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బాల్క సుమన్ తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. విప్ సుమన్ సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపై..
మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న హవర్లీ బేస్డ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ ప్రస్తావించారు. ఉపాధ్యాయుల వేత నాలను పెంచడంతో పాటు కరోనా కాలంలో పెం డింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. ఈ విషయంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాను కూలంగా స్పందించారు.
తాజావార్తలు
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్‌లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్‌పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
- కేసులతో విసిగి హిస్టరీ షీటర్ ఆత్మహత్య
- స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం : మంత్రి హరీష్ రావు